పీసీసీ ప్రొటోకాల్ చైర్మన్‌గా హర్కర వేణుగోపాల్
21-04-2026 12:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): టీపీసీసీ ప్రోటోకాల్, కో ఆర్డి నేషన్ కమిటీని పునర్‌వ్యవస్థీకరించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, వైస్ చైర్మన్‌గా కిషోర్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎంఏ ఫహీమ్‌ను నియమించినట్లు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సభ్యులుగా ఎన్ భానుప్రకాష్‌రెడ్డి, కేవీ ప్రసాద్, సూరజ్ తివారీ, సుది ని మహేందర్, అల్లం రాకేష్‌లను నియమించినట్లు తెలిపారు.






