కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌సింగ్
- హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
- ఆగస్టు 15 నుంచి బెల్జియం, నెదర్లాండ్స్‌లో టోర్నీ
న్యూఢిల్లీ, జూలై 21: ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగాటోర్నీ కోసం భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. 20 మందితో కూడిన జాబితాలో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చారు. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు.ఆగస్ట్ 15 నుంచి 30 వరకు జరగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ సం యుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
డిఫెండర్ అమన్దీప్ లక్రా, మిడ్‌ఫీల్డర్లు రాజ్‌కుమార్ పా ల్, రబిచంద్ర సింగ్, మొయిరాంగ్‌థెమ్, ఫార్వర్డ్ సెల్వం కార్తీ చోటు కోల్పోయారు. ఈ హాకీ ప్రపంచకప్‌లో భారత్ పూల్ డిలో ఉంది. తన తొలి మ్యాచ్‌లో ఆగస్ట్ 15న వేల్స్‌తో తలపడుతుంది. 17న ఇంగ్లండ్, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. 2023 ఎడిషన్‌లో భారత్ 9వ స్థానంలో నిలిచింది.
భారత హాకీ జట్టు:
డిఫెండర్లు: జర్మన్ప్రీత్ సింగ్,హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్,
మిడ్‌ఫీల్డర్లు: రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్.
ఫార్వర్డ్‌లు: దిల్ప్రీత్ సింగ్, శిలానంద్ లక్రా, సుఖ్జీత్ సింగ్, మన్దీప్ సింగ్, అభిషేక్.
గోల్ కీపర్లు: మోహిత్ హెచ్‌ఎస్, సూరజ్ కర్కెరా.






