22 July, 2026 | 1:46 AM

సింధు ఆటను మార్చిన కోహ్లీ సలహా

22-07-2026 12:34 AM

హైదరాబాద్, జూలై 21 : భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు కెరీర్‌లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఫామ్ కోల్పోయి, ఫిట్‌నెస్ సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. తాజాగా జపాన్ ఓపెన్ తో మళ్లీ ఫామ్ అందుకుంది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న సింధు పలు కీలక విషయాలను పంచుకుంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఓ సలహా తన ఆటతీరును మార్చేసిందని సింధు తెలిపింది. తాను గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో ఒకసారి కోహ్లీకి ఫోన్‌చేసానని వెల్లడించింది.

ఫామ్ కోల్పోయిన సమయంలో శతకం కోసం సుదీర్ఘ నిరీక్షణను ఎలా అధిగమించారని కోహ్లీని అడిగాననీ, దానికి ఆయన ఇచ్చిన సమాధానం తన ఆలోచనా విధానంతో పాటు ఆటనూ మార్చేసిందని పేర్కొంది. పరుగులు చేయడంలోనే తాను ఆనందాన్ని ఆస్వాదించడం ప్రారంభించినట్టు కోహ్లీ చెప్పిన విషయాన్ని సింధు వెల్లడించింది. అదే ఆలోచనను తాను కూడా అనుసరించినట్టు, ఆటపై మళ్లీ ఆసక్తి, ఆనందాన్ని పెంచుకున్నట్టు చెప్పకొచ్చింది. కాలివేలి గాయం కారణంగా వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న సింధు తర్వాత అమెరికాలోని అట్లాంటాలో పునరావాస శిక్షణ తీసుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించింది.