ఈ ఫండ్స్‌తో లాభాల పంట
అధిక రాబడులు తెచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్
మ్యూచువల్ ఫండ్ హవుస్‌లు నిర్వహించే స్కీమ్‌ల్లో పెట్టుబడులు చేసే ఇన్వె స్టర్లు ఆయా స్కీములు గతంలో ఎటువంటి రాబడుల్ని ఇచ్చాయో అధ్యయనం చేసి, తగి న స్కీమ్‌ను ఎంపిక చేసుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తుంటారు. వాస్తవానికి గత రాబడులు భవిష్యత్ లాభాలకు గ్యారంటీ కాదుగానీ, ఆయా ఫండ్స్ పనితీరు ను తెలుసుకునే సంకేతమే. మార్కెట్‌తో పో లిస్తే ఆయా స్కీమ్‌లు భవిష్యత్ రాబడులు ఎలా ఉండవచ్చో అంచనా వేసుకో వచ్చు.
అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మదుపునకు ఉపక్రమించేముందు ఆయా ఫండ్ హౌస్ ప్రతిష్ఠ, పెట్టుబడి చేసే స్కీమ్ క్యాటగిరీ, అది యాక్టివ్ స్కీమా లేక పాసివ్ స్కీ మా, యాక్టివ్ స్కీమ్ అయితే దాని ఫండ్ మే నేజర్ల గత పనితీరు పరిశీలించాలి. ఫం డ్స్ ఆఫర్ చేసే స్కీమ్‌ల్లో లార్జ్‌క్యాప్ స్కీమ్స్, మి డ్, స్మాల్‌క్యాప్ స్కీమ్స్, మల్టీక్యాప్ స్కీమ్స్, వివిధ రంగాల స్టాక్స్‌పై ఫోకస్ చేసే సెక్టోరల్ స్కీమ్స్, ఫ్లెక్సీక్యాప్ స్కీమ్స్ తదితరాలుంటాయి.
ఫ్లెక్సీ స్కీమ్స్
మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేసే ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌లు వాటివద్దనున్న నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీకి కేటాయించిన నిధులను ఇవి స్టాక్ మార్కెట్లో ఎటువంటి మార్కెట్ విలువ కలిగిన షేర్లలోనైనా (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) పెట్టుబడి చేస్తాయి. లార్జ్‌క్యాప్‌లో ఇంత, స్మాల్‌క్యాప్‌లో ఇంత ఇన్వెస్ట్ చేయాలన్న నియమమేమీ లేదు. వివిధ రంగాలకు చెంది న స్టాక్స్‌లో పెట్టుబడి చేస్తాయి.
సమయానుగుణంగా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్‌మెం ట్స్‌ను స్వేచ్ఛగా లార్జ్‌క్యాప్స్ నుంచి మిడ్‌క్యాప్స్‌లోకి, మిడ్, స్మాల్ క్యాప్స్ నుంచి లార్జ్‌క్యాప్‌లోకి మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఒక రంగం స్టాక్స్ నుంచి విక్రయించి, మరో రంగం షేర్లలోకి పెట్టుబడుల్ని షిఫ్ట్ చేస్తారు.
39 ఫ్లెక్సీ స్కీమ్‌లు
దేశంలో ప్రస్తుతం 39 ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్ ల్ని వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తున్నాయి. వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహి స్తున్న ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌ల్లో వాటి ఆస్తుల పరిమాణం ప్రకారం పరాగ్ ఫరేఖ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ రూ.82,567 కోట్ల ఆస్తులతో ప్రధమస్థానంలో ఉన్నది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ.64,221 కోట్ల ఆస్తులతో ద్వితీయస్థానంలో ఉన్నది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న రూ.1,897 కోట్ల ఆస్తుల పరిమాణం అన్నింటికంటే తక్కువ.
వాల్యూ స్కీమ్స్
విలువ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని అవలంబించే స్కీమ్స్‌ను వాల్యూ స్కీమ్స్‌గా వ్యవహరిస్తారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసే నిధుల్లో వాల్యూక్యాప్ ఫండ్ మేనేజర్లు కనీసం 65 శాతం స్టాక్స్‌లోకి మళ్లిస్తారు. ఇప్పుడు ఫండ్ పరిశ్రమలో 23 వాల్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. 2024 నవంబర్ 30నాటికి ఈ మొత్తం వా ల్యూ స్కీమ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 1,89,470 కోట్లు ఉన్నది.
ఏడాది కాలంలో అధిక రాబడి ఇచ్చిన వాల్యూ స్కీమ్స్
ఏ మ్యూచువల్ ఫండ్ అయినా మార్కెట్ పనితీరు, ఫండ్ మేనేజర్ అనుసరించే పెట్టుబడి వ్యూహాలక అనుగుణంగా రాబడులు ఉంటాయి. గత ఏడాదికాలంలో స్టాక్ సూచీ లు దాదాపు 15 శాతం పెరగ్గా, అంతకు మించి పలు వాల్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు రాబడుల్ని అందించాయి. వీటిలో అధికంగా ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ స్కీమ్ 32.34 శాతం రాబడుల్ని తెచ్చిపెట్టింది. జేఎం వాల్యూ ఫండ్ 28.35 శాతం, హెచ్‌ఎస్‌బీసీ వాల్యూ ఫండ్ 29.30 శాతం, యూటీఐ వాల్యూ ఫండ్ 27.71 శాతం చొప్పున రాబడుల్ని అందించాయి.
మూడేండ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడి
దేశంలో వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తున్న దాదాపు 10 ఫ్లెక్సీ క్యాప్ స్కీ మ్‌లు గత మూడేండ్లలో చక్రగతిన 15 శా తం చొప్పున వార్షిక రాబడుల్ని అం దించాయి. అన్నింటికంటే అధికంగా జే ఎం ఫ్లెక్సీ క్యాప్ మూడేండ్లలో 22.81 శాతం వార్షిక లాభాలను తెచ్చిపెట్టగా, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ 21.58 శాతం వార్షిక రా బడిని ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 19.31 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 17.23 శాతం చొప్పున రిటర్న్‌లు అందించాయి.







