calender_icon.png 7 May, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్‌లో ‘హార్వెస్ట్’దే ప్రథమ స్థానం

20-04-2025 12:03:19 AM

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థు లు విశేష ప్రతిభ కనబరచి, జాతీయ స్థాయి లో 17వ ర్యాంకు (కేటగిరి) సాధించడమే కాకుండా, జిల్లా ప్రథమ, తృతీయ స్థానాలు సాధించడం అభినందనీయమని ‘హార్వెస్ట్’ కళాశాల యాజమాన్యం శనివారం తెలిపిం ది. ప్రకటించిన ఫలితాలలో తమ కళాశాల విద్యార్థి బి.సాయిచరణ్ జనరల్ (ఈడబ్ల్యూఎస్) జాతీయస్థాయి 17వ ర్యాంకు సాధించ డం తమకెంతో గర్వకారణమన్నారు.

బి. సిద్ధార్థ్ 297వ ర్యాంకు (కేటగిరి)తో జిల్లా తృతీయస్థానాన్ని కైవసం చేసుకున్నాడన్నా రు. కళాశాల తర్వాతి స్థానాలలో ఎన్.రాఘవేంద్ర నవనీత్ 2,704వ జనరల్ ర్యాంకు, డి.శ్రీనివాస్, గౌతమ్‌రెడ్డి (1046) (కేటగిరి), ఎం.నాగయశ్వంత్ 1458 (కేటగిరి) సాధించారన్నారు. కళాశాల నుంచి 40 శాతం మం ది విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం అభినందనీయమన్నారు. 

తమ కళాశాల నుండి గణితంలో 98.986 పర్సంటైల్, భౌతిక శాస్త్రంలో 100 పర్సంటైల్, రసాయన శాస్త్రం 100 పర్సంటైల్ సాధించారని చెప్పారు. 10,000 ల లోపు ర్యాంకులు 28 మంది సాధించడం తమకెంతో సంతోషదాయకమన్నారు. శనివారం కశాళాల ఆవర ణలో హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి విద్యార్థులను అభినందించారు.