6 May, 2026 | 7:49 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

హార్వెస్టర్ యజమాని హత్య

28-11-2024 01:29 AM

కత్తులతో పొడిచి  చంపిన దుండగులు   

మహదేవపూర్, నవంబర్ 27: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సండ్రుపళ్లి గ్రామం వద్ద హార్వెస్టర్ యజమానిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. మంచి ర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యా ల శ్రీకాంత్‌గౌడ్(25)కు చెందిన హార్వెస్టర్ గత మూడు రోజుల నుంచి సండ్రుపల్లి గ్రామంలో వరికోతలు చేస్తున్నది.

ప్రతిరోజు శ్రీకాంత్‌గౌడ్‌తోపాటు డ్రైవర్ ఇద్దరూ శ్రీకాంత్‌గౌడ్ కారులో స్వగ్రామానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరి కోసిన తర్వాత హార్వెస్టర్‌ను డ్రైవర్ ఖాళీ ప్రదేశంలో నిలుపుతున్నాడు. శ్రీకాంత్‌గౌడ్ తన కారులో ఉన్నాడు. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కత్తులతో శ్రీకాంత్‌గౌడ్‌పై దాడి చేసి చం పేశారు. హార్వెస్టర్ డ్రైవర్ పరిగెత్తుకుని రాగా దుండగులు బైకును అక్క డే వదిలిపెట్టి పరుగు తీశారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.