12-11-2025 11:50:25 AM
న్యూఢిల్లీ: ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంతో(Al-Falah University) సంబంధం ఉన్న హర్యానాలోని మేవాట్‌కు చెందిన ఒక బోధకుడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు(Jammu Kashmir Police) బుధవారం ఆ విశ్వవిద్యాలయం నుండి పనిచేస్తున్న 'వైట్ కాలర్' ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మత ప్రబోధకుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఎర్రకోట వద్ద పేలుడు(Red Fort Blast) ఘటనలో మత ప్రబోధకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్ ఫలా విశ్వవిద్యాలయ సముదాయంలోని అద్దె ఇంట్లో ఉంటున్న మౌల్వీ ఇష్తియాక్‌ను శ్రీనగర్‌కు తీసుకువచ్చారు.
ఉగ్ర డాక్టర్ ముజిమ్మిల్(Dr. Muzammil) ఇతని ఇంట్లోనే పేలుడు పదార్థాలు నిల్వఉంచాడు. ఇష్తియాక్ ఇంటి నుండి పోలీసులు 2,500 కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారని, పేలుడు పదార్థాలను డాక్టర్ ముజమ్మిల్ గనై అలియాస్ ముసైబ్, 12 మంది మృతి చెందిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ అతని అద్దె నివాసంలో నిల్వ చేశారని అధికారులు తెలిపారు. దర్యాప్తు అధికారులు ఎర్రకోట కారు పేలుడుతో ఉగ్రవాద మాడ్యూల్‌ను అనుసంధానించి రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన రహదారులపై వాహనాలు విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా యూనిట్లు, ప్రత్యేక విభాగాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇంటెలిజెన్స్, బ్యూరో, పారామిలిటరీ దళాలతో ఢిల్లీ పోలీసులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.