12-11-2025 11:57:33 AM
హైదరాబాద్: నాంపల్లిలోని చేనేత భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉదయం 10.30 దాటినా విధులకు రాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.