calender_icon.png 24 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడగ విప్పిన మట్టి మాఫియా..?

24-12-2025 01:01:37 AM

  1. అధికారుల అండతోనే అక్రమదందా?

అనుమతులు నిల్..తోలకాలు ఫుల్..

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 23, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మట్టి, ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ అనుమతులు లే కుండానే రూ కోట్ల విలువైన మట్టిని తరలిస్తున్నా. అధికారులు కళ్లున్నా కబోదుల్లా వ్య వహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీతారామ ప్రాజెక్టుకు సంబం ధించిన మట్టిని, మట్టి మాఫియా యథేచ్ఛగా దోచుకుంటోంది.

అనుమతులు శూన్యం.. ఆదాయం మాత్రం రూ లక్షల్లో!

సీతారామ ప్రాజెక్టు పనుల్లో భాగంగా వెలికితీసిన మట్టిని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే జెసిబిలు, లారీలతో రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. పూసు గూడెం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు మట్టి కుప్పలను మాయం చేసి, లక్షల రూపాయలు దండుకుంటున్నారు. పాల్వంచ, బూ ర్గంపాడు, ములకలపల్లి, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ఇసుక మట్టి అక్రమ తో లకాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కిన్నెరసాని, మొర్రేడు వాగులను ఎంచుకొని ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పాల్వంచ పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో సుమారు రూ 40 లక్షల విలువైన మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. తాజాగా పట్టణంలోని ఓ మామిడి తోటకు సీతారామ ప్రాజెక్టు మ ట్టిని తరలిస్తూ పక్కా ప్లాన్తో దందా కొనసాగిస్తున్నారనీ తెలుస్తోంది.

సీతారాంపట్నం బై పాస్ రోడ్డు నిర్మాణానికి కూడా ఈ అక్రమ మట్టినే వాడినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.ఈ అక్రమ రవాణా వెనుక ఓ మా ఫియా డాన్ ఉన్నట్లు స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇటీవల ఒక ఆసక్తికర సంఘటన ఒక ఫంక్షన్ హాల్ వద్ద ఇసుకను లారీ లోకి లోడు ఎత్తుతుండగా ఆ పిన ఓ పోలీస్ అధికారి, సదరు మాఫియా డాన్ పేరు వినగానే తన జీపులో అక్కడి నుండి వెనుదిరిగాడని సమాచారం. 

అధికారుల మౌనం..కాసుల గలగలేనా?

రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా ఈ మాఫియాకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.చట్ట విరుద్ధంగా సాగుతున్న ఈ మట్టి, ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.