calender_icon.png 24 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మేడారం దర్శనం బంద్

24-12-2025 01:01:04 AM

  1. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రతిష్ఠాపన 
  2. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పెనుక వంశస్థులు 

మహబూబాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ కుంభమేళగా గుర్తిం పు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై పున:ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధ వారం భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్టు పూజారులు వెల్లడించారు.

కాగా పగిడిద్దరాజు స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూను గొండ్ల నుంచి పెను క వంశీయులు మేడారంలో పగిడిద్దరాజు గద్దెపై ప్రతిష్టించే ధ్వజస్తంభానికి మంగళవారం పూజలు నిర్వహించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పెనుక వంశస్థులు పూను గొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం బయలుదేరి వెళ్లారు. మేడారంలో కొత్తగా నిర్మించిన గద్దెల ప్రాంగణం పై బుధవారం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టిస్తారు.