24-12-2025 01:02:53 AM
పాల్వంచ, డిసెంబర్ 23 (విజయక్రాంతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మంగళవారం పట్టణలోని శేఖరం బంజర యుపిహెచ్సి పరిధిలోని మంచి కంటి నగర్ ను సందర్శించారు. కుష్టు వ్యాధుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా మంచికంటి నగర్ నందు జరుగుతున్న ,సర్వేను పరిశీలించారు. యూపీహె చ్సీని ఆకస్మిక తనిఖీని నిర్వహించి రికార్డులను పరిశీలించారు.
వైద్య సిబ్బంది సకాలం లో ప్రజలకు అందుబాటులో ఉండాలని స మయపాలన పాటించాలని ఆదేశించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో యుపిఎస్సి వైద్యాధికారి, డిపిఎంవో మోహన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.