పెళ్లికి ముందు.. శారీరక సంబంధం నేరమేమీ కాదు!
- ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిసుంటే తప్పేంటి?
- తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి నియామక రద్దు చెల్లదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, జూన్ 8: పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహిత మేజర్లు శారీరక సంబం ధం కలిగి ఉండటం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఈ కారణంతోనే ఒక వ్యక్తి క్యారెక్టర్ (సచ్ఛీలత)పై ప్రతికూల అంచనాకు రాలేమని పేర్కొంది. తెలంగాణకు చెంది న ఒక పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపిక రద్దును కొట్టివేస్తూ న్యాయస్థానం ఈ కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక అభ్యర్థి కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేసింది. సదరు అభ్య ర్థిపై 2014లో ఒక క్రిమినల్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబం ధం పెట్టుకున్నాడనేది ఆ కేసు సారాంశం. అయితే ఈ వివాదం 2015లోనే లోక్ అదాల త్ ద్వారా పరిష్కారమైంది. అభ్యర్థి తన దరఖాస్తు ఫామ్‌లో ఈ కేసు వివరాలను స్పష్టంగా పేర్కొన్నాడు. అయినప్పటికీ, బోర్డు నియామకాన్ని రద్దు చేయడంతో వివాదం సుప్రీంకో ర్టుకు చేరింది.
ఇద్దరు మేజర్లు తమకు నచ్చినట్లు జీవించడాన్ని ఏ చట్టం నిషేధించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి శారీరక సంబంధం పెళ్లితోనే ముగియాలనే నిబంధన లేదు. మారుతున్న సామాజిక పరిస్థితులను అధికారులు అర్థం చేసుకోవాలి. పెళ్లి దాకా వెళ్లనంత మాత్రాన ఒకరు ఇంకొకరిని మోసం చేసినట్లు భావించలేం. లోక్ అదాలత్‌లో రాజీ పడటాన్ని నేరాన్ని అంగీకరించినట్లుగా పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. బాధితు రాలిని బలవంతం చేసినట్లు ఎలాంటి ఆధారా లు లేనప్పుడు యజమాని ప్రతికూల నిర్ణయా లు తీసుకోకూడదు.
సదరు అభ్యర్థి, బాధితురాలు ఒకే ప్రాంతంలో ఉంటూ చాలా ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. మోసం జరిగిందా లేదా అనేది కేవలం బాధితురాలి సాక్ష్యం ద్వారానే రుజువు అవుతుంది. బాధితురాలే స్వయంగా కేసును ముందుకు తీసుకెళ్లకూడదని భావించి రాజీ పడ్డారు. అలాంటప్పుడు అభ్యర్థికి పోలీస్ ఉద్యోగానికి అవసరమైన క్యారెక్టర్ లేదని రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎలా నిర్ణయిస్తుందని కోర్టు ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు ముగిసిపోయిన అభ్యర్థుల విషయంలో యాజమా న్యాలు అనుసరించాల్సిన విధానాన్ని కోర్టు వివరించింది. నేరం జరిగినట్లు, అందులో అభ్యర్థి పాత్ర ఉన్నట్లు బలమైన ఆధారాలు ఉంటేనే వ్యతిరేక నిర్ణయం తీసుకోవాలి.
ఈ కేసులో మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని బెంచ్ అభిప్రాయపడింది. రిక్రూ ట్‌మెంట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధం గా నిలబడదని స్పష్టం చేస్తూ అభ్యర్థి ఎంపిక రద్దును సుప్రీంకోర్టు కొట్టివేసింది.






