31 August, 2026 | 1:32 AM

కరీంనగర్‌లో హెచ్‌సీఏ బృందం పర్యటన

31-08-2026 12:00 AM

కరీంనగర్, ఆగస్టు 30 : జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి, సౌకర్యాలపై దృష్టి సారించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) వరుస పర్యటనలు చేస్తోంది. తాజాగా హెచ్ సీఏ క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ హెడ్ అంబటి రాయుడు(Ambati Rayudu), జిల్లా క్రికెట్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, హెచ్‌సీఏ మాజీ కార్య దర్శి టి. శేష్ నారాయణ్, మహిళా క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ శ్రీమతి సునీత ఆనంద్ ఆదివారం కరీంనగర్ అలుగునూర్‌లోని వెలిచాల జగపతి రావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్, అకాడమీని సందర్శించారు.

కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు అగమ రావు హెచ్‌సీఏ ప్రతినిధి బృందాన్ని స్వాగతించారు. ఇప్పటికే క్రికెట్ మౌలిక సదుపా యాలు, టర్ఫ్ వికెట్లు, ప్రాక్టీస్ నెట్స్ మరి యు జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం కెడిసిఎ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురిం చి వారికి వివరించారు. హెచ్ సీఏ సిఫార్సులకు అనుగుణంగా ప్రతిపాదిత అకాడమీకి అవసరమైన అదనపు సౌకర్యాలను అందించడానికి కెడిసిఎ సిద్ధంగా ఉందని ఆయన ప్రతినిధి బృందానికి తెలియజేశారు.

ఇతర క్రికెట్ మౌలిక సదుపాయాలను పరిశీలించి, కరీంనగర్‌లో హెచ్‌సీఏ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసే అవకాశాలపై కెడిసిఎ ప్రతినిధులతో చర్చించింది. వీజేఆర్ గ్రౌండ్, సౌక ర్యాలపై  జిల్లా స్థాయిలో నాణ్యమైన క్రికెట్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో కెడిసిఎ చేస్తున్న కృషిని అంబటి రాయుడు ప్రశంసించారు.