శ్రీలంకకు ఐసీసీ బిగ్ షాక్
- ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం రద్దు
- లంక బోర్డులో ప్రభుత్వ జోక్యమే కారణం
దుబాయి, ఆగస్టు 30: శ్రీలంక క్రికెట్(Sri Lanka Cricket)కు ఐసీసీ భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది అక్కడ జరగాల్సిన మహిళల చాంపియన్స్ ట్రోఫీ(Womens Champions Trophy) ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షాఫ్టర్ ప్రకటన చేశారు. టోర్నీని మరో దేశానికి తరలించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ టోర్నీని 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించా ల్సి ఉంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి.
శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే ప్రధాన కారణం. అలాగే బోర్డు పాలనలో సంస్కరణలు, ఎన్నికలు నిర్వహించడంలో ఆలస్యం వంటి అంశాలపై అసంతృప్తిగా ఉన్న ఐసీసీ, టోర్నీ ఆతిథ్య హక్కులను తొలగించింది. ఐసీసీ ఇటీవలే శ్రీలంక క్రికెట్ ప్రతినిధులను ఐసీసీ బోర్డు సమావేశానికి హాజ రుకాకుండా ఆంక్షలు కూడా విధించింది.
గతంలో 2024 అండర్-19 ప్రపంచకప్ ఆతి థ్య హక్కులను కూడా శ్రీలంక కోల్పోయిం ది. ఆ టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించారు. ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంకకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ లభించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టోర్నీకి అర్హత సాధించగా, శ్రీలంక ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధించకపోవచ్చు.






