13 May, 2026 | 12:49 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

పనిచేస్తున్న కంపెనీనే హ్యాక్ చేశాడు

19-10-2024 01:17 AM

ఉత్తర కొరియా సైబర్ నేరగాడి నిర్వాకం

ఐడెంటిటీ మార్చుకొని జాబ్‌లో చేరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఉత్తరకొరియాకు చెందిన సైబర్ నేరగాడు ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి.. ఏకంగా తాను పనిచేస్తున్న కంపెనీకే ఎసరుపెట్టాడు. తన ఐడెంటిటీని మార్చుకొని కంపెనీలో రిమోట్ ఐటీ వర్కర్‌గా ఉద్యోగంలో చేరి డాటా ను హ్యాక్ చేసేందుకు యత్నించాడు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరకొరియాకు చెందిన సైబర్ నేరస్థుడు తనకు కంపెనీ ఇచ్చిన యాక్సెస్‌ను వాడుకొని సంస్థ డాటా ను హ్యాక్ చేశాడు. పూర్తి నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేయడానికి ప్రయత్నించగా.. అతడు విధులకు రెగ్యులర్‌గా హాజరుకాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల సాధ్యపడలేదు. మేనేజ్‌మెంట్ అతడి మెయిల్ ను చెక్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.

కంపెనీ డాటాను తిరిగి ఇవ్వడానికి అతడు తిరస్కరించాడని, డబ్బులు చెల్లించాలంటూ బెది రింపులకు పాల్పడ్డాడని యాజమా న్యం సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్యూర్‌వర్క్స్‌కు వెల్లడించింది. కాగా కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అధికమయ్యాయని, కంపె నీ యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.