calender_icon.png 4 September, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్తాపంతో యువకుడు మృతి

03-09-2025 11:48:05 PM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడు మనస్తాపనికి గురై మృతి చెందిన ఘటన బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక శ్రీనివాస నగర్ కు చెందిన కుషన నవీన్(33) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.