6 May, 2026 | 8:08 PM

Breaking News

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •  

నా నడుముపై చపాతీలు వేడి చేస్తానన్నాడు

17-10-2024 12:00 AM

మల్లికా షెరావత్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని బాలీవుడ్ నటీమణి. బోల్డ్ అంట్ హాట్ సీన్లలో నటించే ఈ భామ హిందీతోపాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. ప్రత్యేక గీతాలతోనూ యువతను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ‘మర్డర్’ సినిమాలో ఆరబోసిన హాట్‌నెస్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా గ్లామర్ పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ ‘హాట్ దివా’గా క్రేజ్ సొంతం చేసుకుంది.

2012లో హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరమైన మల్లిక.. అడపాదడపా హిందీ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మల్లికా షెరావత్ దక్షిణాది దర్శకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

“ఓ సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్.. ఓ హాట్ ఐటెం సాంగ్‌లో నటించాలని కోరాడు. ఆ పాటతో నా హాట్‌నెస్ ప్రేక్షకులకు మరింత చేరువవుతుందని చెప్పాడు. నేను సరేనని చెప్పి, పాటలో నా హాట్‌నెస్‌ను ఎలా చూపిస్తారని అడిగా. దీనికి ఆ డైరెక్టర్ ‘నీ నడుము మీద చపాతీలు వేడి చేస్తా’ అన్నాడు! అంతే ఇక ‘ఈ సాంగ్ చేయను’ అని చెప్పేశా” అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.