6 May, 2026 | 9:02 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

జిమ్‌లో గాయపడిన రకుల్

17-10-2024 12:00 AM

రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుని ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయింది. బిజినెస్ పనులుంటేనే హైదరాబాద్ వచ్చి పోతోంది. ఇక దక్షిణాదిన సినిమాలు అసలు చేయడమే లేదు. ఆమెకు అవకాశాలు రావడం లేదో.. లేదంటే ఆమే వద్దనుకుందో కానీ సౌత్‌కు పూర్తిగా దూరమైంది. హిందీ అవకాశాలు ఒకటీ అర దక్కించుకుంటోంది. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ఈ ఏడాది గోవాలో వివాహం చేసుకున్న రకుల్.. సినిమాలతోపాటు బిజినెస్ కూడా చేసుకుంటూ బిజీగా గడిపేస్తోంది.

ఉన్న జిమ్ బిజినెస్‌కు తోడు గత ఏడాది ఫుడ్ బిజినెస్‌లోకి కూడా రకుల్ ఎంటరైంది. ఇక తాజాగా రకుల్ జిమ్‌లో బరువులు ఎత్తుతూ గాయపడిందని సమాచారం. ఆమె నడుము భాగానికి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో రకుల్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటోందట. ప్రస్తుతం రకుల్  బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది.