calender_icon.png 12 January, 2026 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

07-01-2026 01:11:10 AM

సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ భేటీలో చర్చ

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించా రు. 8వ తేదీన గాంధీ భవన్‌లో జరిగే పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై నేతల మధ్య చర్చ జరిగింది. కేంద్రం కుట్ర పూరితంగా  మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం, పథ కం పేరు మార్చడంపై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి చర్చించారు.

కృష్ణ, గోదావరి జలాల పిపిపీ విషయంలో కూడా చర్చ. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై చ ర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విషయం లో డివిజన్, వార్డ్ ఆభ్యర్థుల ఎంపికను అ త్యంత  పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వార్డు, డివిజన్‌ల నుంచి 6 గురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.