6 July, 2026 | 1:10 PM

Breaking News

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •  

పాస్‌పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం హెడ్ కానిస్టేబుల్‌పై వేటు

08-05-2025 12:00 AM

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి), పాస్ పోర్ట్ విచారణలో నిర్రక్షంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గత ఏడాది పాస్పోర్టు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు హెడ్ కానిస్టేబుల్  పి.కృష్ణ ను ఇంచార్జ్ డిఐజి సన్ ప్రీత్ సింగ్,  సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం వెల్లడించారు.  హెడ్ కానిస్టేబుల్ కృష్ణ గత ఏడాది కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న సమ యంలో, టేకుల రాజయ్య పాస్పోర్టు దరఖాస్తు పై విచారణ చేయువిషయములో తీవ్ర నిర్లక్ష్యాన్ని వ్యవహరించారు. 

కనీస ప్రాథమిక పరిశీలన లేకుండానే క్లియరెన్స్ ఇచ్చారు.   సమగ్ర విచారణ చేయలేకపోవ డం వలన రాజయ్యకు అంతకు ముందే రాజు పేరుపై ఉన్న పాస్పోర్టు గురించి తెలుసుకోలేకపోయారు. తదుపరి రాజయ్య పై RGI ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ నందు కేసు కూడా నమోదు అయింది. ఈ విషయములో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర  దృష్టికి రావడంతో పరిశీలిం చారు. అనంతరం ఈ  విషయాన్ని ఇంచార్జ్ డిఐజి కి నివేదిక పంపించారు.

ఈ విషయాన్ని  సీరియస్గా పరిగణించిన ఇంచార్జ్ డి ఐ జి , బాధ్యతారాహిత్యానికి బాధ్యుడైన హెడ్ కానిస్టేబుల్ పి. కృష్ణను తక్షణమే సస్పెండ్ చేస్తూ బుధవారంఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ డిఐజి సన్ ప్రీత్ సింగ్,   మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తుందని అన్నారు,

బాధ్యత  లేకుండా ప్రవర్తించే పోలీసు అదికారులు, సిబ్బంది పై నిరంతరం నిఘా ఉంటుందని ఇంచార్జ్ డి ఐ జి  స్పష్టం చేశారు. ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటువేయడంతో జిల్లాలో పోలీస్ శాఖలో కలకలం రేపు తుంది.