08-05-2025 12:00:00 AM
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే7(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై బుధవారం మండలంలోని అంకుశాపూర్ లోని తేలివాడ, గొల్లగూడ కాలనీవాసులు సుమారు 60 మందికిపైగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రా వు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.
వారికి కాషా యం కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. జిల్లా లో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, కేంద్రంలో మోదీ పాలనకు ఆకర్షి తులై వివిధ పార్టీల నుండి కార్యకర్తలు, నా యకులు బీజేపీలో చేరడం శుభసూచికమన్నారు.
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయకేతనాన్ని ఎవరు ఆపలేరని స్ప ష్టం చేశారు. పార్టిలో చేరిన వారిలో శంకర్, గణేష్, వెంకటేష్, తినుపతి, మల్లేష్, బాలాజి, సంతోష్, శ్రావణ్, ప్రకాష్, రమేష్, సుభాష్, మహేష్, నాందేవ్ ఉన్నారు.