07-05-2025 10:54:17 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya) బుధవారం ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ఇతర అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.