ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్
హాజరైన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు
ధర్మపురి,మార్చి25(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ ఆదేశాల మేరకు వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బండమీది కవితతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలందర్ రెడ్డి, ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరాలను ఏ ర్పాటు చేయడం జరుగుతోందని, గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చిన రో గులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా క్టర్ తేజశ్విని, వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, కాంగ్రెస్ నాయకులు బందెల ఉదయ్ గౌడ్,గుమ్ముల అజ య్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




