24 August, 2026 | 3:15 AM

సహజ సిద్ధ పంటలు, ఆహారంతోనే ఆరోగ్యం

24-08-2026 02:44 AM

పద్మశ్రీ సుభాష్ శర్మ 

నిర్మల్ ఆగస్టు 23 ( విజయ క్రాంతి) దేశంలో సహజ సిద్ధ ఆహార పంటలతోనే ప్రజల ఆరోగ్య జీవనం ఆధారపడి ఉందని పద్మశ్రీ రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుభాష్ శర్మ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సహజ సిద్ధ ఆర్గానిక్ వస్తువుల, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏటా నిశతుల్యమైన గాలి, నీరు,ఆహారం, వల్ల 15 లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు.

దేశానికి ఆహార పదార్థాలను అందించే రైతులు సహజసిద్ధ పంటలు పండించినప్పుడే దేశ ప్రజలు సురక్షితంగా ఉం టారని తెలిపారు. దేశంలో ఆర్గానిక్ ఆహార పదార్థాలను అందించాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ఆర్గానిక్ ఆహార పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంచామని తెలిపారు. దీనికి కేంద్ర ప్రభు త్వం గుర్తించి తనకు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చారని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నానని పేర్కొన్నారు.

ఆహార పదార్థాల విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దేశంలో రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసి వారు ఉత్పత్తి చేసిన సహజ సిద్ధ ఆహార పంటలను, మొక్కల సాయంతో అనేక వస్తువులను మార్కెట్లో ఉంచుతున్నామని తెలిపారు. నిర్మల్ లో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి, నిర్వాకులు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.