calender_icon.png 21 June, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో ఆరోగ్యకరమైన జీవితం

21-06-2025 06:50:59 PM

అదనపు కలెక్టర్ వీరారెడ్డి..

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే ప్రధాన సూత్రం యోగ అని, శరీరానికి, మనస్సుకి శక్తినిచ్చేదే యోగా అని రెవిన్యూ అదనపు  కలెక్టర్ వీరా రెడ్డి(Additional Collector Veera Reddy) అన్నారు. శనివారం రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ  యోగ దినోత్సవాన్ని  జిల్లా ఆరోగ్యం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ వీరా రెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇందుకోసం యోగ ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని యోగ ను ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు.

నిత్యజీవితంలో ప్రతీ ఒక్కరు విధిగా యోగను అలవాటు చేసుకోవాలని.. దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నారు.యోగ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని యోగ ఆసనాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి.. ఏకాగ్రత, రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందన్నారు. అనేక శారీరక, ఆరోగ్య ప్రయోజనాలను అందించే యోగ అందరి జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని.... వయస్సుతో సంబంధం లేకుండ ప్రతీ ఒక్కరు.. యోగ కోసం రోజులో కొంత సమయం కేటాయించాలిసిన అవసరం తప్పకుండ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా వైద్య అధికారి మనోహర్, యువజన యూత్ వెల్ఫేర్ అధికారి ధనంజనేయులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పాల్గొన్నారు.