calender_icon.png 25 October, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటినుంచి మరోసారి విచారణ

24-10-2025 01:21:00 AM

-అసెంబ్లీ పరిసరాల్లో ఈనెల 31 వరకు ఆంక్షలు 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) :  పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం నుంచి మరోసారి విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చి న అనర్హత పిటిషన్లపై   తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటికే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈనెల 24 నుంచి 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు కూడా విధించారు. ఈ మౌఖిక వాదనలు ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాదులు పిటిషనర్ల తరుఫు న్యాయవాదుల మధ్య జరుగనున్నది.

ఇప్పటికే ముగిసిన క్రాస్ ఎగ్జామినేష న్స్‌లో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలె యాద య్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం జరిగే మౌఖిక వాదనల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ కేసు విచారణ ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎమ్మె ల్యే తరుఫు న్యాయవాదులు, పిటిషనర్ తరుఫు న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ, మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ, మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కేసు విచారణను స్పీకర్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆంక్షలు విధిం చడంతో అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.