calender_icon.png 25 October, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది

25-10-2025 08:25:02 AM

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్మోహన్

ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఏటీసీ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఎమ్మెల్యే మదన్మోహన్ పర్యవేక్షించారు.సుమారు, కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి పట్టణంలో నూతన భవనం పరికరాలతో సహా పలు విధమైన కోర్సులను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అందుబాటులో ఉంచామని విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మదన్మోహన్ విద్యార్థులకు తెలిపారు.

అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల్లో ఏటీసీ సెంటర్ లో,ఆరు కోర్సులు,1,ఇండస్ట్రియల్,రోబోటిక్స్,అండ్,డిజిటల్ మ్యనిప్యాక్చరింగ్,టెక్నీషియన్

2,మ్యనిప్యాక్చరింగ్, ప్రాసేస్ కంట్రోల్,అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్,

3,వర్చువల్ అనల్లసిస్,అండ్ డిజైనర్,

4,ఇంజనీరింగ్ డైజెయిన్,టెక్నీషియన్,

5,కంప్యూటర్,న్యూమరికల్,కంట్రోల్, మెష్నింగ్ టెక్నీషియన్

6,మెకానిక్,ఎల్కట్రిక్,వెహికిల్.

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి.

ఐటిఐ లో, ఏలెక్ట్రిషన్ కోర్స్ అందుబాటులో ఉంది.వివిధ రకాలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు శ్రద్ధతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు గాంచాలని, కోరారు. ఈ కార్యక్రమంలో, ఏటీసీ సెంటర్ ఐటిఐ ప్రిన్సిపల్ రూపా నాయక్,ఏటివో,చంద్ర శేఖర్,సిబ్బంది హరీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వినోద్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్,ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి,నాయకులు తమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బోండ్ల సాయిలు,చింతల శంకర్,తదితరులు, పాల్గొన్నారు.