25-10-2025 08:33:34 AM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఇటీవలే ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో ద్విచక్ర వాహనం పై నుండి,పడి మృతి చెందిన మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్, వెల్లుట్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ అతని భార్య లత ఇద్దరు దంపతులు కొద్ది రోజుల వ్యవధిలోనే మరణించడంతో వారి పిల్లలకు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మదన్మోహన్ ధైర్యం నింపి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమృత రావు విద్యుత్ షాక్ తో దురదృష్టవశాత్తుగా మృతి చెందాడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్మోహన్ శుక్రవారం నేరుగా అమృత ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్ మాజీ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు బొండ్ల సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.