25-10-2025 08:19:59 AM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని- చింతల పోచమ్మ ప్రతిష్టాపన ఆలయ మహోత్సవ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు వేద పండితుల ఆధ్వర్యంలో గోపూజ, గణపతి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని చింతల పోచమ్మ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవంలో భాగంగా… ఆలయంలో ప్రతిష్టించనున్న విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని పురవీధుల మీదుగా ఆలయం వరకు ఈ ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు, స్వీకరించారు.ఈ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి గౌడ సంఘం అధ్యక్షులు ఆలయ నిర్వహణ కర్త, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు మతమాల ప్రశాంత్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు.