వివాహిత ఆత్మహత్య కేసులో నిందితునికి జైలుశిక్ష, జరిమానా
కీలక తీర్పును వెలువరించిన మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. నారాయణ
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): వరకట్నం వేధింపులతో యువతి ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రు.10 వేలు జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. నారాయణ గురువారం తీర్పు వెలువరించా రు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
బీర్పూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన లహరి @ ప్రియాంక కు సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన కొమురోజు రాజేందర్ తో వివాహం జరిగిందని, వివాహ సమయంలో రు.4 లక్షల నగదు, బంగారం, ఇచ్చి వివా హం చేశారని తెలిపారు.
వివాహం తర్వాత కొంతకాలానికి రాజేందర్ అదనపు కట్నం కోసం లహరిని శారీరకంగా మానసికంగా వేదించసాగాడని, ఈ విషయం లో పలు మార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ, రాజేందర్ లో ఎ లాంటి మార్పు రాకపోగా లహరి ని మరింత వేధించడం మొదలుపెట్టాడన్నారు.ఈ వేధింపులు భరించలేక, లహరి @ ప్రియాంక తన జీవితం పై నిరాశతో, 22 సెప్టెంబర్ 2019 న జగిత్యాల పట్టణం లో తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలో చ నిపోవడం జరిగిందన్నారు.
మృతురాలి తం డ్రి ఫిర్యాదు మేరకు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిoదితుడు కొమురాజు రాజేంధర్ ను అరెస్ట్ చేసి కోర్టు లో ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన తరువాత నిందితుని పై నేరం రుజువు కావ డం తో అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రు.10 వేలు జరిమాన విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణ తీర్పు వెలువరించినట్లు తెలిపారు.
నిందితుకి శిక్ష పడటంలో కృషి చేసిన అడిషనల్ పీ.పీ మల్లేశం, అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీ సర్స్ డిఎస్పిలు ఏం.వెంకటరమణ, పీ.వెంకటరమణ, ఎస్.ఐ అల్తాఫ్ ఖాన్, సి ఎం ఎస్ ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ మహేందర్, రాజు నాయక్, కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగాఅభినందించారు.




