12-01-2026 03:41:59 AM
సికింద్రాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరే షన్‌ను ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఆదివారం బాలంరాయ్‌లోని లీ ప్యాలెస్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమా వేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్థిత్వాన్ని దెబ్బ తీయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 17న 10 వేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజి రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు, జెండాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. ధర్నా లు, రాస్తారోకో, బంద్‌లు, దీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేయడానికి నీ అయ్య జాగీరా అని సీఎం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే ప్రాంతాన్ని నీ అబ్బ జాగీరు లా ముక్కలు చేస్తానంటే ప్రజలు నిన్ను ముక్క లు చేస్తారని హెచ్చరించారు. డీ లిమిటేషన్‌లో డివిజన్‌ల విభజన ఇష్టానుసా రంగా చేశారని ధ్వజమెత్తారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఇష్టారీతిన డివిజన్‌లను ఏర్పాటు చేశారని అన్నారు. కార్పోరే షన్ ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని చెప్పారు. పోరాటానికి మద్దతుగా వివిధ వ్యా పార, వాణిజ్య, కార్మిక సంఘాలు, జర్నలిస్టు, కుల సంఘాలు, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్‌లు సమావేశంలో పాల్గొని సంఘీభా వం తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, సామల హేమ, ప్రసన్న, సునీత, శైలజ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, నాయకులు టిఎన్ శ్రీనివాస్, స భ్యులు పాండు యాదవ్, లోకనాధం, నళిని ప్రభాకర్, ముఠా జయసింహ, నర్సింహ ముదిరాజ్, వివిధ వ్యాపార, వాణిజ్య, కార్మి క సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.