22 June, 2026 | 2:58 AM

ఆత్మీయ ‘అలాయి బలాయి’

22-06-2026 12:05 AM

దీర్ఘ్యకావ్యాల సృజనలో అందెవేసిన చెయ్యి వనపట్ల సుబ్బయ్యది. ఇటీవల ఆయన మొహర్రంపై దీర్ఘకవిత వెలువరించడం అభినంద నీయం. తెలంగాణ పల్లె జీవనంలో మొహర్రం ఒకటి. ఇది పది రోజుల జాతర. ఆ పది రోజులను తన కవితల్లో అక్షరీకరించాడు సుబ్బయ్య. నిజానికి మొహర్రం అనేది మహమ్మదీయుల్లో ఒక తెగవారు అమరులైన వారి జ్ఞాపకాలను శోక దినానాలుగా జరుపుకొంటారు.  ౧౪ శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరా టానికి ప్రతీకే ఈ మొహర్రం. న్యాయం కోసం జరిగిన పోరులో ఎంతోమంది వీరులు అమరులయ్యారు. శత్రువులు అలా పదోరోజు ఇమామ్ హుస్సేన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు.

తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం ముస్లింలే కాకుండా, అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్లుగా సాగుతూ వస్తున్నది. యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామి 1830 జూన్  29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం గురించి తాను రచించిన ‘కాశీ యాత్ర చరిత్ర’లో అభివర్ణించాడు. ‘షెహర్ కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టు ఈ మొహర్రం ప్రబలమైన ఉత్సవము. ఈ ఉత్సవ కాలంలో  పరమాత్ముని చైతన్యం, ఆ షెహరులో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్తులుగా నుండేవారు కూడా. షెహర్‌కు వచ్చి ఆ తొమ్మిది దినములు మొదలు ఆఖరు వరకు’ అని అభివర్ణించాడు.

మొహర్రం నెలను షహీద్ (అమరవీరుల) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకొంటారు. ‘అషురా’ కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం శోకదినాలుగా గడుపుతారు. తెలంగాణలో ఈ మొహర్రంను పీర్ల పండుగ పేరుతో జరుపుకొంటారు. దీని ప్రత్యేకతను కవి వనపట్ల సు బ్బయ్య తన దీర్ఘకవితలో తనదైన శైలిలో కవతా కథనంలా రాశాడు. మా చిన్నప్పుడు మా ఊర్లో పీర్ల పండుగ బాగా జరిగేది. మాది గద్వాల సంస్థానం. మా రాజులది పీర్లకు జాగీర్లు ఇచ్చిన చరిత. మా ప్రాంతం లో వెండి బంగారు పీర్లు ఉం డేవంటే ఆ వైభవాన్ని ఇట్లే ఊహించవచ్చు. మొత్తం మా డివిజన్ లో 123 దాదాపు పల్లెలు దాక ఉన్నాయి.

పీర్లపండుగ వచ్చిందంటే మాచో ట పెద్ద సందడి. అలాయి గుం తల్లో పిల్లలు దుంకులాటలు పెద్దలు జోరుగా పందేలు కా సుకోవడాలు రకరకాల కార్యక్రమాలు జరిగేవి. సాయంత్రం అయితే ఎక్కడెక్కడి వాళ్లు వ చ్చి మొక్కుబడులు సమర్పించుకునేవారు. ఇక తొమ్మిదో రోజు సాయంత్రం గాంధీచౌక్ దగ్గర పీర్ల రాక కోసం జనమంతా ఎదురుచూసేవారు. రాత్రంతా మేల్కోని నిద్ర వస్తే గ్రాంథిగారి అరుగుపై నిద్రపోయేవారు. పదో రోజు సాయంత్రం సవారీ వస్తుందంటే ఒక పెద్ద జాతరను తలపించేది. గాంధీ చౌక్ నాలుగు కూడళ్ల వద్ద వేల సంఖ్యల్లో జనం. అలాంటి పీర్ల పండుగను తనదైన శైలిలో వనపట్ల సుబ్బయ్య దీర్ఘకావ్యంగా ‘ఆలాయి బలాయి’ పేరుతో వెలువరిచటం ముదావహం. కవి ఈ దీర్ఘకవితలో మొహర్రం..

పల్లె జీవనంలో ఎలా ముడిపడి ఉందనేది ఆవిష్కరించాడు. కులాలకు అతీతంగా అందరూ కలిసి మెలసి పల్లెల్లో జరుపుకొనే ఆచార వ్యవహారాల్ని వివరించాడు. కవి చాలా దగ్గరుండి పరిశీలించిన తీరు మనకు బాగా కనిపిస్తుంది. వాటిని వర్ణించిన విధానం ‘ఆకుపచ్చని మెరుపులు/ పసుపు ఎరుపు అంచు జరీలు/  పందిట్లో పెళ్లికూతురులా/ సావిట్లో కొలువైన పీర్లు/ పీర్ల చావిడీల వర్ణన/ ఎర్రమన్ను జాజు సు న్నాలు/ అలుకు పూతలు రంగు రంగుల తీరు/ కొత్త కొత్త ఇండ్లలా మసీదులు ముస్తాబు పీర్ల చావిడిముందు వెలిసిన గుండం గూర్చి వర్ణన కూడా బాగుంది. ‘పీర్లంటే మహాత్ములు త్యాగధునులు అంటాడు మరోచోట.

‘మలీద ముద్దలు మట్కీళ్ల పానకం నెమలి కట్టల దీవెనలు.. ఇమాం కాసీం హసన్ హుస్సేన్ బీబీ ఫాతిమా వీరోచిత గాథలు.. సబ్బండ వర్గాలు పీర్లను కూర్చ పెట్టడం చిన్నా పెద్దలు దీవెనలు పొందడం ఎన్నో విషయాల వర్ణన కవి ఏకధాటిగా కవిత్వం చేశాడు. హిందూ ముస్లిం భాయి భాయి కులమతాల వాసన లేని మొహం బాయి బాయి కుల మతాల వాసనలు లేని మొహర్రం పండుగను వర్ణించాడు. కోలాట బొడ్డెమ్మ పాటలు తాళాలు తప్పెట్లు అనేక రకాల వాద్యాలు కనిపిస్తాయి. 

     రేడియం, వ్యాసకర్త సెల్: 92915 27757