8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

భూలోక స్వర్గం

14-10-2024 12:00 AM

మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఖజ్జియార్ హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం. ఇక్కడ పగటిపూటతో పాటు రాత్రిని కూడా ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఖజ్జియార్ పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే పచ్చికభూములకు ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి గడ్డి మైదానం మధ్యలో కనిపించే ఓ చిన్న సరస్సు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అచ్చం ప్రకృతిమాత పల్లకీపై ఊరేగినట్లు ఖజ్జియార్ సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. ఇక్కిడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు.  

ఎలా వెళ్లాలి: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చెరుకొని.. అక్కడి నుంచి డల్హౌసీకి లగ్జరీ బస్సులు, కార్ల ద్వారా వెళ్లొచ్చు. ఢిల్లీ నుంచి దాదాపు అక్కడికి వెళ్లడానికి ఒక్కరికీ 1500 రూపాయల ఖర్చు అవుతుంది.