8 July, 2026 | 8:14 PM

Breaking News

గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •  

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు

08-07-2026 07:35 PM

ఖమ్మం హెల్త్,(విజయక్రాంతి): ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల అడ్వాన్స్డ్ గ్రాడ్యుయేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు, ప్రిన్సిపాల్ డా.బి.గోపాల్ మాట్లాడుతూ... పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినుల్లో సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలే లక్ష్యమని తెలిపారు.

శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ నైపుణ్యాలు, డిజైన్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యల పరిష్కార సామర్థ్యాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మన్మోహన్ తివారి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.