07-07-2025 12:04:14 AM
- రుయ్యాడి హుస్సేన్ హుస్సేన్ దేవస్థానానికి భారీగా పోటెత్తుతున్న భక్తులు
- సావర్లు ఎత్తుకొని ఊరేగించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, జూలై 6 (విజయక్రాంతి): మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యా ప్తంగా ప్రజలు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. హస్సేన్ హుస్సేన్ దేవస్థానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పిరీలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన తలమడుగు మండలం రుయ్యాడి లో మొహరం వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి హస్సేన్ హుస్సేన్ దేవస్థానం లో దర్శించుకుని ముక్కులను తీర్చుకుంటున్నారు. రుయ్యాడి సావార్లకు మనసులో ఉన్న కోరికలు కోరుకునే మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
దీంతో హస్సేన్ హుస్సేన్ దేవస్థానం వద్ద సందడి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన రుయ్యా డి హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని, తలమడుగులోని సావర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పిరీలకు ప్రత్యేక పూజలు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాల ని పిరీలకు మొక్కుకున్నారు. అనంతరం స్థానికుల కోరిక మేరకు పీరీలను ఎత్తుకొని ఊరేగిం పులో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఎమ్మెల్యే వెం ట పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
ముగిసిన మొహర్రం వేడుకలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 6 (విజయక్రాంతి): మొహరం వేడుకలు వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఆదివారంతో ముగిశాయి. హస్సెన్ హుస్సేన్ నాలా హైదర్ భవనం వద్ద వద్ద డప్పు వాయిద్యాల నడుమ పీరీల నృత్యాలతో గ్రామాలలో ఊరేగించారు.ఆసిఫాబాద్, కాగజ్ నగర్‌లో నిర్వహించిన వేడుకల్లోఈ కొమురవె ల్లి మల్లేష్, నందయ్య, మెంగాజీ, దేవార వినోద్, పెంటు ఖాన్, రమేష్, తిరుపతి, హసీన్, భక్తులు పాల్గొన్నారు.