సీఎం ఇంటి ఎదుట పోలీసుల భారీ భద్రత
21-03-2026 01:02 AM
శుక్రవారం, మార్చి 20 (విజయక్రాంతి): ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పా ట్లు చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుండి ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాన రోడ్ల వెంబడి బార్కెట్లు ఏర్పాటు చేసి అటుగా వెళ్లే వారిని పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకుని పంపించారు. కొడంగల్ ఆర్టిసీ బస్టాం డ్ ఆవరణలో మరియు ప్రధాన రోడ్ల వెంబ డి పోలీసులు గుంపులు గుంపులుగా ఉండి బందోబస్తు నిర్వహించినారు.




