06-10-2025 12:03:44 AM
కరీంనగర్, అక్టోబర్5(విజయక్రాంతి): కరీంనగర్ తో పాటు సమీపంలోని తిమ్మాపూర్, సిరిసిల్ల జిల్లాలో ఆదివారం మధ్యా న్నం గంట పాటు భారీ వర్షం కుఈసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు లో6.28 , కొనరావుపేట లో 4.5, గంబిరావుపేటలో 3. 4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయింది.
కరీంనగర్ భారీ వర్షం తో లోతట్టు ప్రాం తాలు జలమయమైనయి. కలెక్టరేట్ రోడ్డు పై కొద్దిసేపు రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలతో మరోసారి ఎల్ ఎం డి కి వరద ప్రవాహం పెరగడం తో మధ్యాన్నం ఆరు గేట్లు ఒక ఫిట్ మేర ఓపెన్ చేసి దిగువకు12000 క్యూసెక్కులనీటినివదిలారు.