06-10-2025 12:08:46 AM
-పార్టీ పెద్దల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
-అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల హడావుడి
-హైకోర్టు తీర్పు కోసం అందరి ఎదురుచూపులు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 05: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు ఆశా వహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి అత్యధికులు పోటీపడు తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఉత్సాహం చూపుతున్నారు. పార్టీ పెద్దలను, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పరుగు తీస్తున్నారు. మొదటి విడతలో స్థానిక సం స్థల ఎన్నికల షెడ్యుల్ను అధికారులు ప్రకటించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశలలో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదటి విడతగా ఈ నెల 23న, సర్పంచ్ ఎన్నికలు మొదటి విడతలో 31న నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ నెల 8న హైకోర్టు వెల్లడించే తీర్పు ఎలా ఉండనుందో, ఎన్నికలు జరుగుతాయో లేవోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలైన ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
జెడ్పీటీసీ, ఎంపీపీలు స్థానాలు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల జెడ్పీటీసీ స్థానాలు.. ఇబ్రహీంపట్నం - బీసీ (మహిళ), మంచాల - ఎస్సీ , యాచారం - బీసీ (జనరల్), అబ్దుల్లాపూర్మెట్ - జనరల్ (మహిళ) అదేవిధంగా.. ఎంపీపీలు స్థానాలు.. ఇబ్రహీంపట్నం - బీసీ (మహిళ), మంచాల - బిసి, యాచారం - బిసి, అబ్దుల్లాపూర్మెట్ - జనరల్ (మహిళ) కు కేటాయించారు.
ఎంపీటీసీ స్థానాలు.. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 8 స్థానాలు:
అబ్దుల్లాపూర్మెట్-1(జనరల్), అబ్దుల్లాపూర్మెట్-2 (జనరల్), అనాజ్పూర్( బీసీ), బండరావిరాల (జనరల్-మహిళ), కవాడిపల్లి(జనరల్-మహిళ), లష్కర్గూ డ(ఎస్సీ), మజీద్పూర్ (బీసీ), బాటసింగారం (బీసీ-మహిళ)కు కేటాయించారు.
యాచారం మండలంలో 14 స్థానాలు:
మంతన్గారెల్లి (జనరల్), మాల్ (ఎస్సీ), నల్లవెల్లి (జనరల్-మహిళ), మేడిపల్లి (బీసీ-జనరల్), చింతపట్ల (బీసీ-జన రల్), కొత్తపల్లి (ఎస్టీ- జనరల్), యాచారం (ఎస్సీ-మహిళ), తులే ఖుర్డు (బీసీ-జనరల్), గున్గల్ (ఎస్సీ-జనరల్), నందివనపర్తి (ఎస్సీ-జనరల్), మల్కీజ్గూడెం (జనరల్), కుర్మిద్ద (బీసీ-మహిళ), తాటిపర్తి (బీసీ-మహిళ), చౌదరిపల్లి (బీసీ-మహిళ).
ఇబ్రహీంపట్నం 10 స్థానాలు:
ఎల్మినేడు (ఎస్సీ -మహిళ), పోచారం (బీసీ-మహిళ), చర్లపటేల్గూడెం (బీసీ-మహిళ), కప్పపాడు (ఎస్సీ-జనరల్), తులేకలాన్ (బీసీ-జనరల్), పోల్కంపల్లి (జనరల్), రాయపోల్-1 (జనరల్ మహిళ), రాయ పోల్ (ఎస్సీ-మహిళ), దండుమైలారం-1 (జనరల్), దండుమై లారం-2 (బీసీ-మహిళ).
మంచాల మండలంలో 13 స్థానాలు:
ఆరుట్ల-1 (ఎస్సీ-జనరల్), ఆరుట్ల-2 (జనరల్-మహిళ), బండలేమూరు (ఎస్టీ-మహిళ), చెన్నారెడ్డిగూడ (బీసీ-జనరల్), తాళ్లపల్లిగూడ (బీసీ-జనరల్), మంచాల (ఎస్సీ-మహిళ), లింగంపల్లి (బీసీ-మహిళ), జాపాల (బీసీ-మహిళ), ఆగా పల్లి (బీసీ-జనరల్), దాత్పల్లి (ఎస్టీ-జనరల్), బోడకొండ (జన రల్), లోయపల్లి (ఎస్టీ-జనరల్), అంబోతండా (జనరల్) కేటాయించారు.
హైకోర్టు తీర్పు పై ఆశలు..
ఎక్కువ శాతం సీట్లు రిజర్వేషన్ కోటా కింద ప్రకటించడంతో పోటీ చేయాలనుకున్న ఇతరులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. పోటీకి అవకాశం వస్తే తప్పకుండా బరిలో నిలిచి పదవిలో కూర్చోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రాకపోవడంతోవారి ఆశలన్నీ అడిఆశలయ్యయి. వారందరు అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు వెలువరించే తీర్పు పైన ఆశలు పెట్టుకున్నారు.