06-10-2025 12:02:31 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : భారతదేశానికి రాజ్యాంగం ద్వారా దశ దిశ చూసిన మహానేత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ కోలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బి వెంకటనారాయణ ముదిరాజ్ కొనియాడారు. బిసి ల రిజర్వేషన్ మరియు మహిళలు పురుషులతో సమాన హక్కుల కోసం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 234వవారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం నిర్వహించ బడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి.బి. వెంకటనారాయణతో పాటు కోలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్ల దేవేందర్ ముదిరాజ్ , కె. విజయ్ కుమార్ ముదిరాజ్, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాక సభ్యులు ఉదారి సుదర్శన్ ముదిరాజ్, కె విజయ్ కుమార్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత దేశానికి ఒక దశ దిశ చూపిన మహానేత అంబేద్కర్ అన్నారు. 60 దేశాల రాజ్యాంగాన్ని చదివి మన భారత దేశానికి అనుగుణంగా కుల, మత, ప్రాంతాలకి అతీతంగా రూపొందించారు.
2026లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కులగనలో అందరు పాలు పంచుకొని, మేము ఎంతో మాకు అంత అని చట్ట సభలో రిజర్వేషన్ సాధించే విధంగా పోరాటం చేయాలి అని తెలియజేసారు. ఇలా ప్రజలని చైతన్య పరుస్తున్న యం.అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్ నాయకులు బండారి రాందాస్ , కడపోళ్ల మల్లేష్, కె. నర్సింగరావు, కడప ఈశ్వర్, అంకం సురేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పి. దామోధర్ రెడ్డి, వెంకటాచారి, ఎం. వెంకటేష్, శంకర్, టి. శ్రీరామ్, బి. గణేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.