calender_icon.png 6 October, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధైర్యంగా ఉండండి..అండగా ఉంటాం

06-10-2025 12:04:18 AM

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 

-అమెరికాలో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు పరామర్శ

ఎల్బీనగర్, అక్టోబర్ 5 :  అమెరికాలోని డల్లాస్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను ఆదివారం బీఎన్ రెడ్డి డివిజన్ లోని టీచర్స్ కాలనీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం నింపారు. ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, బీఎన్ రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.