13 April, 2026 | 1:59 AM

పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం

08-12-2024 02:28 AM

* తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన-- 

* ప్రతి ధాన్యం గింజను కొంటాం: మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, డిసెంబర్ 7 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో శనివారం భారీ వర్షం కురియడంతో మంథని, రామగుండం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నా రు. వర్షానికి తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని, రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.