13 April, 2026 | 12:28 AM

హోంగార్డులకు వేతనాలు పెంచింది బీఆర్‌ఎస్సే

08-12-2024 02:28 AM

 శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): హోంగార్డులకు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీమా సౌకర్యం కల్పించామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. వారి రూ.9వేల వేతనాన్ని కేసీఆర్ రూ.20 వేలకు పెంచడంతోపాటు పీఆర్సీ 30 శాతం అందించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్పెషల్ పోలీస్ అసిస్టెంట్‌లను పర్మినెంట్ చేసి, చనిపోయిన హోంగార్డులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు.