09-05-2025 12:00:00 AM
22న ఖమ్మం టీటీడీసిలో జరిగే జిల్లా సభ సక్సెస్‌కు కృషి చేయండి
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 8 (విజయక్రాంతి) ః ఐక్యతకు నిదర్శనమే మైనార్టీ గ్రామీణ వైద్యులు అని, వారి సమస్యల పరిష్కార%ళి%లో తమ రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ముందుంటుందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. గ్రామీణ వైద్యులు ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యాలను తొలి దశలోనే కాపాడడంలోనూ, ప్రాథమిక చికిత్స అందించడంలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలుస్తున్నారని అందుకే వారు మానవ రూపంలో వున్న భగవత్ స్వరూపులని ఆయన ఉద్ఘాటించారు.
గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో గ్రామీణ మైనార్టీ వైద్యుల సంఘం సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.కోవిడ్ మహమ్మారి విజృంభించిన దశలో తమ ప్రాణాలకు తెగించి.. కోవిడ్ వైరస్ బారిన పడిన బాధితులకు జాగ్రత్తలు.. సూచనలిస్తూ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సమాచారాన్ని చేరవేస్తూ... వైరస్ వ్యాప్తి నిర్మూలనలో గ్రామీణ వైద్యులు ఆనాడు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ వైద్యులు అందరు సమిష్టి ఆలోచనలతో ముందుకు వెళ్లినప్పుడే సంఘం బలోపేతం అవుతుందన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు ముందు గ్రామీణ వైద్యులకు ఇచ్చిన హామీను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గ్రామీణ మైనారిటీ వైద్యుల సంఘం నేతలు రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ, సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి లను వారు శాలువాతో ఘనంగా సత్కరించారు..
ఈకార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ హసన్ (నేరడ), జిల్లా అధ్యక్షులు షేక్ హసన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీ మియా, జిల్లా మాజీ అధ్యక్షుడు నజీరుద్దీన్,జిల్లా కోశాధికారి. బాబుమియా, జిల్లా ఉపాధ్యక్షులు ఖాసిం,చాంద్ పాషా, జిల్లా జాయింట్ సెక్రటరీ ఆషా, తదితరులు పాల్గొన్నారు.