25-08-2025 01:23:01 AM
కథువా, ఆగస్టు 24: కథువా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయింది. వరదల వల్ల జమ్మూ పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. వాహనాలను వేరే మార్గంలోకి మళ్లించినట్టు అధికారులు పేర్కొన్నారు. కథువా డిప్యూటీ కమిషనర్ రాజేశ్ శర్మ మాట్లాడుతూ.. ‘పురాతన బ్రిడ్జి బాగా పాడయిపోయింది. కొత్తది ఎలా ఉందనే అనుమానం కూడా ఉంది.
అందుకోసమే వెంటనే వాహనాల రాకపోకలు నిలిపివేశాం. ఇంజినీర్లు, హైవే అధికారులు వచ్చి తనిఖీలు చేసి నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు. జమ్మూలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి.