calender_icon.png 25 August, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్

25-08-2025 01:21:29 AM

  1. పరారీకి యత్నించిన నిందితుడు
  2. కాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులు
  3. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
  4. అదనపు కట్నం కోసం భార్యకు నిప్పంటించిన నోయిడా వాసి విపిన్
  5. నిందితుడి తల్లి అరెస్ట్
  6.   14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విపిన్

న్యూఢిల్లీ, ఆగస్టు 24: అదనపు కట్నం కోసం భార్యను హతమార్చిన కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు విపిన్‌ను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా.. విపిన్ వారి చేతిలోని తుపాకీ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీ సులు విపిన్‌ను కాళ్లపై కాల్చారు. అనంతరం అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో విపిన్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విపిన్‌ను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గ్రేటర్ నోయిడాలో విపిన్ అనే వ్యక్తి.. అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న ఆ మ హిళను ఆమె సోదరి ఆస్పత్రికి తీసుకెల్లినా ప్రయోజనం లేకుండా పోయింది. తన భా ర్యను తాను హత్య చేయలేదని.. ఆమెనే పె ట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని విపి న్ పోలీసులతో పేర్కొన్నట్టు వారు తెలిపారు.

ఆలిని చంపాననే పశ్చాత్తాపం విపిన్‌లో అస్సలుకే కనిపించట్లేదంటున్నారు పోలీసు లు. భార్యను హత్య చేసిన అనంతరం విపిన్ బంధువులు, పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి విఫలం అయినట్టు తెలుస్తోంది. భార్య చనిపోయిన తర్వాత విపి న్ తెలివిగా ఆమెతో ఉన్న ఫొటోలను సా మాజిక మాధ్యమాల్లో షేర్ చేసి నన్నెందుకు ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్ అంటూ పోస్టులు పెట్టాడని పోలీసులు తెలిపారు.

భార్య భర్తల మధ్య గొడవలు సహజం. అని విపిన్ పోలీసులతో అన్నట్టు తెలుస్తోంది. ‘పోలీసులు సరైన పనే చేశారు. నేరస్తులే పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. విపిన్ ఒక నేరస్తుడు. మిగిలిన వారిని కూడా తొందరగా పట్టుకోవాలి’ అని నిక్కీ తండ్రి మీడియాకు తెలిపారు. 

అదనపు కట్నం తేవాలని.. 

విపిన్ భాటి భాటి పెళ్లి సమయంలో విపిన్‌కు నిక్కీ తల్లిదండ్రులు కారు, నగదు, విలువైన వస్తువులను కట్నం కింద ఇచ్చారు. అయినా కానీ విపిన్ మాత్రం అదనపు కట్నం తీసుకురావాలని నిక్కీని తరచూ వేధించేవాడని చుట్టుపక్కల వారు పేర్కొంటున్నారు. నిక్కీని గురువారం రోజు కొట్టి చంపి అనంతరం పెట్రోల్ పోసి కాల్చేసే ప్రయత్నం చేశాడు. కాలిన గాయాలతో ఉన్న నిక్కీని ఆమె సోదరి ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

‘కాల్చేందుకు ఉపయోగించిన మండే ద్రవ బాటిళ్లను స్వాధీనం చేసుకోవడానికి హత్య జరిగిన ప్రదేశానికి రాగా.. విపిన్ ఎస్సై చేతిలోని తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కాల్పులు జరి పాం’ అని గ్రేటర్ నోయిడా అదనపు డి ప్యూటీ కమిషనర్ సుధీర్ వివరించారు. విపిన్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు.