calender_icon.png 28 August, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

28-08-2025 08:40:04 AM

హైదరాబాద్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు భారత వాతావరణ శాఖ(India Meteorological Department) హెచ్చరించింది. హైదరాబాద్‌లో గురువారం వర్షపాతం తగ్గింది, చినుకులు, తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యాయి. రాబోయే ఆరు గంటల్లో గణనీయమైన వర్షాలు కురవవని వాతావరణ పరిశీలకులు తెలిపారు. అయితే, తెలంగాణలోని అనేక జిల్లాలకు తీవ్ర వర్ష హెచ్చరిక జారీ చేయబడింది. కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రిలలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ వెదర్‌మ్యాన్ ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్‌లలో పరిస్థితి విషమంగా ఉంది. కోర్ అల్పపీడన ప్రాంతంలో(Core low pressure area) వర్షాలు మరో స్పెల్‌కు దారితీసే అవకాశం ఉంది. కామారెడ్డిలో గత 36 గంటల్లో ఇప్పటికే 500–600 మి.మీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్‌లలో కూడా రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్‌లో కుత్బుల్లాపూర్, గాజులరామారం, సేరిలింగంపల్లి, మాదాపూర్, బాలానగర్, మియాపూర్, ఆర్‌సి పురం, అల్వాల్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, మల్కాజిగిరి సహా ఉత్తరాది ప్రాంతాల్లో రాగల రెండు గంటలపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ(Orange alert issued) చేసింది. భారీ వర్షాల కారణంగా కామారెడ్డిలో జిల్లా వ్యాప్తంగా నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం బీమాలింగం కత్వా వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డు  లెవల్‌ బ్రిడ్జి పైనుంచి మూసీ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బొల్లెపల్లి-సంగెం, చౌటుప్పల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.