calender_icon.png 28 August, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే

28-08-2025 11:25:05 AM

రామాయంపేట:  మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం నాయకులతో కలసి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీలలోకి నీరు చేరడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామాయంపేట చేరుకొని వరద ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను కోరారు.మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుండి కుండాపోత వర్షం పడి చెరువులు అలుగులు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి అని అన్నారు.

చెరువులు రోడ్లు తెగిపోవడం వలన వరద నీళ్లు రోడ్ల పై ప్రవహిస్తుండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నక్క వాగు వద్ద ఒక స్తంభాన్ని పట్టుకొని ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అక్కడే బ్రిడ్జి వద్ద పదిమంది వ్యక్తులు ఉన్నారని వాళ్ళని కాపాడడానికి చాపర్  తీసుకురావాలని  ప్రభుత్వాన్ని కోరాము. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు.గతంలో కేసీఆర్  ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్నప్పుడు హెలికాప్టర్ ద్వారా ప్రజలను రక్షించామని గుర్తు చేశారు. జిల్లాలో రిస్క్ టీం లో ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ వర్ష ప్రభావం వల్ల చాలా చోట్ల  ఇండ్లు కూలిపోయాయని  అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ, పోలీస్,వైద్యశాఖ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఈ సందర్భంగా కోరారు.వీరితోపాటు రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే. చంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ. నరేందర్,న్యాయవాది జీవన్ రావు,నాయకులు అహ్మద్, ఉమామహేశ్వర్, నాగార్జున, అసోనోద్దీన్,బొల్లా. రాజు,  సిద్దిరాములు,జుబర్ అహ్మద్, రంజిత్ నాయక్ తదితరులు ఉన్నారు.