calender_icon.png 28 August, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలకు ఆబోతుపల్లి వద్ద చిన్న బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం

28-08-2025 11:08:46 AM

తూప్రాన్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను తూప్రాన్ పరిధిలోని ఆబోతుపల్లి వద్ద హల్దివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గుండ్రెడ్డిపల్లికి వెళ్లే చిన్న వంతెన బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయింది. ప్రయాణికులు ఎవరు అటువైపుగా వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి భారీగా నీరు ఉప్పొంగి రావడంతో ప్రమాద గంటికలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.