calender_icon.png 28 August, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెలికాప్టర్ల ఆలస్యంపై ఫోన్ చేసిన బండి సంజయ్

28-08-2025 10:54:17 AM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) రక్షణ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. తెలంగాణకు మూడు హెలికాప్టర్లను రెడీ చేశామని కేంద్ర రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక పోవడంతో బాధిత ప్రాంతాలకు  చాపర్ల రాక  ఆలస్యమవుతోందని అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయ స్టేషన్ల నుండి చాపర్లను రప్పించే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు. 

నాందెడ్, బీదర్ స్టేషన్ల(Nanded and Bidar stations) నుండి చాపర్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల(Flood-prone areas) ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం(State Government) యుద్ద ప్రాతిపదికన తీసుకునే చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమయ్యాయని తెలిపారు. వీలైనంత తొందరగా చాపర్లను పంపాలని కేంద్ర మంత్రి కోరారు.