28-08-2025 10:48:25 AM
అప్రమత్తమైన అధికారులు
చర్ల,(విజయక్రాంతి): చత్తీస్గడ్ రాష్ట్రం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలోని వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలో గల తాలిపేరు ప్రాజెక్ట్ (Thaliperu project) ఉదయం 10 గంటల సమయం లో అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో 24 గేట్లు ఎత్తి సుమారు 36579 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి అధికారులు విడుదల చేస్తున్నారు ,
ప్రాజెక్ట్ స్థూల సామర్థ్యం.Mcft
730.00 క్రెస్ట్ లెవల్-M 69.00
ప్రస్తుత నీటి మట్టం.70.57 మీ గా ఉంది,
ప్రస్తుత సామర్థ్యంMcft 253.88
ఇన్‌ఫ్లో క్యూసెక్కులు 34343 నీటి వరద ప్రాజెక్టుకు చేరతా ఉంది. ఒకసారిగా తాలిపేరు వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.